(CPS) కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌

పెన్షన్‌ సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వము 2001-02 సం||లో 'జాతీయ పెన్షన్‌ పథకం' (National Pension Scheme) పేరుతో నూతన పెన్షన్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో 18 నుండి 60 సం||లు వయస్సుగల భారత పౌరులు ఎవరైనా చందాదారులుగా చేరవచ్చు. చందాదారులుగా చేరిన ప్రతి వ్యక్తికి 'ప్రాన్‌కార్డు' (Perminent Retirement Account Number Card) జారీ చేయబడుతుంది.