సెలవు నిబంధనలు

ఫండమెంటల్‌ రూల్సు యొక్క అనెగ్జర్‌-III నందు సెలవు నిబంధనలు-1933 చేర్చబడియున్నవి. ఈ సెలవు నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని యాజమాన్యములలోని ఉపాధ్యాయులకు వర్తించును. ఇందులో సంపాదిత సెలవు, అర్థజీతపు సెలవు, జీతనష్టపు సెలవు అను మూడు రకములున్నవి. యఫ్‌,ఆర్‌. అనెగ్జర్‌-VII నందు క్యాజువల్‌ సెలవులకు సంబంధించిన నిబంధనలు చేర్చబడియున్నవి. ఉద్యోగి అర్హత కలిగి వున్నప్పుడు అతడు కోరిన సెలవును మాత్రమే మంజూరు చేయాలి.