రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆహ్వానం

రౌండ్‌ టేబుల్‌ సమావేశం
ఆహ్వానం 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంటుతో నూతన వేతనాలను 01.07.2013 నుండి అమలు జరపడం సంతోషకరం గౌ||ముఖ్యమంత్రి గారు 02.06.2014 నుండి ఆర్థికలాభం కల్పిస్తున్నట్లు ఫిబ్రవరి 5న ప్రకటించినప్పటికీ వాస్తవంగా 01.03.2015 నుండి మాత్రమే నూతన వేతనాల ప్రయోజనం ఉద్యోగులకు అందింది. 02.06.2014 నుండి 28.02.2015 వరకు చెల్లించాల్సిన బకాయిల సంగతి ఇంకా తేలలేదు. పిఆర్‌సికి అనుబంధంగా రావలసిన గ్రాట్యుటీ పెంపుదల, సంపాదిత సెలవు, అర్థవేతన సెలవులు నగదుగా మార్చుకొనే సౌకర్యం, అదనపు పెన్షను, వికలాంగుల కన్వేయన్సు అలవెన్సు, గిరిజన ప్రాంత ఉద్యోగులకు అదనపు ఇంటిఅద్దె అలవెన్సు, తదితర జి.ఓలు ఇంకా వెలువడలేదు. 02.06.2014 తర్వాత రిటైరైన వారు పెన్షను, గ్రాట్యుటీ పొందలేక ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు, గిరిజన ప్రాంతాల ఉద్యోగులకు నూతన వేతనాలలో అలవెన్సులు కొనసాగించడం లేదని ఆవేదనతో ఉన్నారు. ఇంకా పిఆర్‌సి సిఫారసు మేరకు 2 సం||ల చైల్డ్‌కేర్‌ లీవ్‌ ఉత్తర్వులు వస్తాయని మహిళా ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత సం|| దీపావళి కానుకగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరోగ్య కార్డుల పథకం ఆచరణాత్మకంగా లేదు. అన్ని కార్పోరేట్‌ హాస్పిటల్స్‌ ఆరోగ్యకార్డులపై ఉద్యోగులకు చికిత్స చేసేటందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. తదితర సమస్యలపై చర్చించి తదుపరి కార్యాచరణను రూపొందించుకోవడానికై ది: 21.07.2015 మంగళవారం ఉదయం 10-30 గం||కు TSUTF రాష్ట్ర కార్యాలయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయనైనది. మీరు తప్పనిసరిగా హాజరై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యతలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.