ముఖ్యమైన సర్వీసు నిబంధనలు, స్టేట్‌, సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్సు - 1996

రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యమునగల గజిటెడ్‌, నాన్‌ గజిటెడ్‌ పోస్టులకు సంబంధించి డిపార్టుమెంట్ల వారీగా వేర్వేరు సర్వీసు నిబంధనలు గలవు. వాటన్నిటికి వర్తించెడి సాధారణ నిబంధనలు, ప్రత్యేక నిబంధనలు, తాత్కాలిక నిబంధనలు స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ - 1996 పేరున జిఓ.ఎంఎస్‌.నం. 436 జిఏడి తేది. 15.10.1996(అధ్యాపక దర్శిని-15) ద్వారా ఇవ్వబడినవి.
ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి సాధారణంగా వాడబడెడి - క్యాడర్‌, డ్యూటీ, రెగ్యులర్‌ అపాయింట్‌ మెంట్‌, ప్యానల్‌, ప్రొబేషన్‌, అప్రూవ్డ్‌ క్యాండిండేట్‌, సర్వీస్‌ మున్నగు పదముల నిర్వచనములు రూలు-2 నందు ఇవ్వబడినవి.