ముఖ్యమైన సర్వీసు నిబంధనలు

1. రెగ్యులరైజేషన్‌, ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ : డిఎస్‌సి చే సెలక్టు చేయబడిన ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్‌ వారి నియామకము తేదీ నుండి చేయబడుతుంది. పోలీసు యాంటిసిడెంట్స్‌ రిపోర్టు సకాలంలో రాని కారణంగా రెగ్యులరైజేషన్‌కు పెద్ద ఆటంకంగా వున్నది. రెగ్యులరైజేషన్‌ తేదీ నుండి మాత్రమే సీనియార్టీ పరిగణించబడుతుంది. రెగ్యులర్‌ సర్వీసు రెండు సంవత్సరాలు పూర్తయిన తరువాత ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ చేయబడుతుంది. లోయరు క్యాడరులో రెగ్యులరైజేషన్‌ అయిన తదుపరి ప్రమోషన్‌ పొందితే ప్రత్యేకంగా రెగ్యులరైజేషన్‌తో పని లేకుండా సంవత్సరం సర్వీసు పూర్తయిన తరువాత ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ చేయబడుతుంది. ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ సకాలంలో చేయబడనప్పుడు డిక్లరేషన్‌ జరిగినట్లుగానే భావించబడుతుంది.