ఫండమెంటల్‌ రూల్సు - ఫిక్సేషన్లు, ఇంక్రిమెంట్లు

ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్‌ రూల్స్‌ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్‌ గ్రేడు, 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్డ్‌ పే స్కేల్సు, మొ||వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయ బడుచున్నది.
అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్‌ రూల్సు 24,26,27ననుసరించి చేయబడతాయి.