జిపిఎఫ్‌ నిబంధనలు, సిసిఏ నిబంధనలు, టిఎ నిబంధనలు, లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌

ఒక సంవత్సరము సర్వీసు గల ప్రభుత్వ, పంచాయితీరాజ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిపిఎఫ్‌ చందాదార్లు అగుటకు అర్హులు. పంచాయితీరాజ్‌ ఉపాధ్యాయుల ప్రావిడెంట్‌ ఫండ్‌ 01.07.1984 నుండి ''జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌''గా మార్చ బడినది. జిపిఎఫ్‌ ఖాతా దార్లు క్రింది విధంగా నెలసరి చందా చెల్లించాలి.