గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ పథకం, ప్రభుత్వ జీవిత బీమా పథకం

గతంలో అమలులోవున్న 'కుటుంబ సంక్షేమ పథకం' స్థానంలో జిఓ.ఎంఎస్‌.నం. 293 ఆర్థిక, తేది. 08.10.1984 ద్వారా ''ఆం.ప్ర. ఎంప్లాయీస్‌ గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీము 1984'' 01.11.1984 నుండి ప్రవేశ పెట్టబడింది. 
నిబంధనలు : 01.11.1984 నాటికి సర్వీసులో గల ప్రభుత్వ, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ ఉద్యోగులు మరియు 10 సం||లు నిండి ప్రభుత్వోద్యోగులుగా మారిన వర్క్‌ చార్జిడ్‌ ఉద్యోగులు ఈ పథకంలో సభ్యులు. 01.11.1984 తర్వాత సర్వీసులో చేరినవారు తదుపరి నవంబరు నుండి మాత్రమే సభ్యులగుదురు. అయితే అట్టివారు ఇన్స్యూరెన్స్‌ కవర్‌ చేయడానికి వారు ఏ గ్రూపుకు చెందుతారో దానిని బట్టి ప్రతి రూ. 10/-ల యూనిట్‌కు రు. 3లను, ప్రతి రూ. 15ల యూనిట్‌కు రూ. 4.50లను తదుపరి నవంబరు వరకు చెల్లించాలి. ఉద్యోగి ఫారం 6 లేక 7లో యిచ్చిన నామినేషన్‌ సర్వీసు రిజిష్టరులో అంటించి, నమోదు చేయాలి.
ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి జిఓ.ఎంఎస్‌.నం. 315 విద్యాశాఖ, తేదీ. 22.07.1986 ద్వారా ఇటువంటి స్కీమే 01.07.1986 నుండి వర్తింప చేయబడింది. అయితే ఎయిడెడ్‌ పాఠశాలలకు ఎల్‌ఐసి వారే నేరుగా ప్రీమియంలు వసూలు చేసి, చనిపోయిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఎయిడెడేతర ఉపాధ్యాయులకు ఎల్‌ఐసితో నేరుగా సంబంధం లేదు.