అంబేద్కర్‌పై కాషాయ పడగనీడ -ఆనంద్‌ తెల్‌తుంబ్డే

భారతదేశ ఎన్నికల మార్కెట్లో ప్రవేశపెట్టబడిన వివిధ రాజకీయ ప్రారిశ్రామికవేత్తలు తయారుచేసిన అంబేద్కర్‌ ప్రతిమలు అసలు అంబేద్కర్‌ను మసకబారుస్తున్నాయి. అవి దళితుల విమోచనకు ఉపయోగపడే రాజకీయ ఆయుధాల్ని నాశనం చేస్తున్నాయి. ఈ ప్రతిమల మధ్య ఛాయలో తేడాలున్నప్పటికీ ఇవన్నీ అంబేద్కర్‌కు నయా ఉదారవాదరంగు పులుముతున్నాయి.
                  అంబేద్కర్‌ దళితులందరికీ ఆరాధ్యదైవం అయ్యాడనటంలో సందేహం లేదు. ఆయన వారికోసం ఏక వ్యక్తిగా, ఏకైక ధ్యేయంతో చేసిన కృషికి వారలా భావించటం సహజం. అది నిజమైనప్పటికీ అంబేద్కర్‌ను పూజ్యనీయుడిగా ప్రతిష్టించటంలోనూ, ప్రోత్సహించటంలోనూ పాలకవర్గాలు ఉత్ప్రేరక పాత్ర పోషించాయి. ఈ మధ్యకాలంలో బిజెపి అంబేద్కర్‌ను బాహాటంగా సొంతంచేసుకోవాలనే ప్రయత్నాల వెనుక కారణాల గతిశీలతను దళితులు అర్థంచేసుకోవాల్సి వుంది.
పూజ్యనీయునిగా...
                   రాజకీయ హిందూకు ప్రాతినిధ్యంవహిస్తున్న కాంగ్రెస్‌ అంబేద్కర్‌కు ప్రధాన ప్రత్యర్థి. 1932లో జరిగిన రౌండు టేబుల్‌ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అంబేద్కర్‌ చేసిన ప్రయత్నాలను గాంధీ తీవ్రంగా వ్యతిరేకించటమే కాకుండా, దళితుల స్వతంత్ర రాజకీయ అస్తిత్వం ఏర్పడే సాధ్యతను శాశ్వతంగా దూరంచేసిన పూనా ఒడంబడిక చేసుకునేలా ఆయనపై ఒత్తిడి చేశాడు. అధికారం బదిలీ అయిన తరువాత అంబేద్కర్‌ను రాజ్యాంగ పరిషత్తులోకి ప్రవేశించకుండా కాంగ్రెస్‌ చేయగలిగిందంతా చేసింది. కానీ అంతలోనే అది ప్లేట్‌ మార్చింది. వివరణ కోసం పిట్టకథలు ఎన్నిచెప్పినా రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశించే అవకాశంలేని అంబేద్కర్‌ను ఎన్నికయ్యేలా చేసి, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడయ్యేలా చూడటం వెనుక గాంధీ వ్యూహాత్మక మేథస్సు వుంది. రాజ్యాంగంలో దళితుల హక్కులకు భద్రత కల్పించినందుకు ప్రతిగా అంబేద్కర్‌ ఒక రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాడు. ఆ సౌభ్రాతృత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. హిందూ కోడ్‌ బిల్లు విషయంలో తిరోగమన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నెహ్రూ మంత్రివర్గంనుంచి అంబేద్కర్‌